ప‌వ‌న్ బ‌ర్త్‌డేకి చెర్రీ గిఫ్ట్ ఏంటో తెలుసా ?

Tue,August 28, 2018 10:07 AM
ram charan special gift to fans on pawan birthday

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా, నిర్మాత‌గా చాలా బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో క‌థానాయ‌కుడిగా మాస్ మ‌సాలా చిత్రం చేస్తున్న చెర్రీ త‌న తండ్రి చిరంజీవి న‌టిస్తున్న సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సైరా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు చ‌ర‌ణ్‌. ఇక ప‌వ‌న్ బ‌ర్త్ డే సెప్టెంబ‌ర్ 2 కాగా,ఆ రోజు త‌న మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట చెర్రీ. ఆ మ‌ధ్య జ‌రిగిన రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్‌లో ప‌వ‌న్‌పై త‌న‌కున్న ప్రేమ‌ని చెర్రీ బ‌హిరంగంగా వ్య‌క్త‌ప‌ర‌చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న బాబాయ్ బ‌ర్త్‌డే రోజు మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు మెగా ప‌వ‌ర్ స్టార్ బంప‌ర్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని టాక్. చెర్రీ తాజా చిత్రంలో కియారా అద్వాణీ క‌థానాయిక‌గా నటిస్తున్నారు. ఆర్యన్ రాజేష్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా విలన్‌గా వివేక్ ఒబెరాయ్ కన్పించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై దానయ్య, పార్వతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

3783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS