సోడాలు, ఐస్‌క్రీములు అమ్మిన రామ్ చ‌రణ్‌

Fri,April 27, 2018 08:41 AM
ram charan soda selling video goes viral

రంగ‌స్థ‌లం సినిమాతో భారీ హిట్ కొట్టిన రామ్ చ‌రణ్‌ ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూనే మ‌రోవైపు బోయపాటి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే చెర్రీ తాజాగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియో వద్ద సోడాలు, ఐస్‌క్రీములు అమ్ముతూ క‌నిపించారు. చెర్రీని చూసిన అభిమానులు అక్క‌డికి భారీ ఎత్తున త‌రలి వ‌చ్చారు. చెర్రీ ఇలా చేయ‌డానికి కార‌ణం ఓ సోష‌ల్ కాజ్ కోసం అని తెలిసి అభిమానులు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. మంచు ల‌క్ష్మీ హోస్ట్‌గా మేము సైతం అనే కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌గా, ఈ ప్రోగ్రాంకి గెస్ట్‌గా వ‌చ్చేవారు ఏదో ఒక‌ ప‌ని చేసి ఆ వ‌చ్చిన డ‌బ్బుతో పేద‌ల‌కి సాయం చేయ‌డం ఈ కార్యక్ర‌మం ముఖ్య ఉద్దేశం. మేము సైతం సీజ‌న్ 1 స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి కాగా ప్ర‌స్తుతం సీజ‌న్ 2 నడుస్తుంది. ఇందులో భాగంగా చ‌ర‌ణ్ సోడాలు, ఐస్‌క్రీములు అమ్మి కొంత మొత్తం సంపాదించారు. ఆ మొత్తాన్ని పేద ప్ర‌జ‌ల‌కి అందించ‌నున్నారు. ఇక చెర్రీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు తెగ పోటిప‌డ్డారు. సినిమా విష‌యానికి వ‌స్తే రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

3571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS