జ‌పాన్‌లో మెగా ర‌చ్చ‌..ధ‌న్య‌వాదాలు తెలిపిన చెర్రీ

Tue,September 11, 2018 11:13 AM
ram charan shocking on japan craze

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కించిన చిత్రం మగధీర. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారత సినిమాలకు జపాన్‌లో మంచి మార్కెట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్ర‌మంలో మగధీర సినిమా అప్పట్లో జపాన్‌లో సబ్‌టైటిల్స్‌తో విడుదలైంది. 2009లో వచ్చిన ఈ చిత్రాన్ని మరోసారి జపాన్ థియేటర్లలో విడుద‌ల చేశారు. మగధీర విడుదలైన సమయంలో ఎస్‌ఎస్ రాజమౌళికి జపాన్‌లో ఉన్న క్రేజ్ తక్కువే. అయితే బాహుబలి విడుదలైన తర్వాత ఒక్కసారిగా జక్కన్న పేరు జపాన్‌తోపాటు వివిధ దేశాల్లో మార్మోగిపోయింది. జపాన్‌లో రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మగధీర సినిమాను అక్కడ మళ్లీ విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా కేవలం పది రోజులలో దాదాపు రూ.17 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

రామ్ చ‌రణ్ న‌టించిన మ‌గ‌ధీర చిత్రానికి ల‌భిస్తున్న ఇంతటి ఆదరణ గురించి తెలుసుకున్న మన కాలభైరవ(మెగా పవర్ స్టార్ రామ్ చరణ్) ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. థాంక్యూ జపాన్.. మాపై మీరు చూపిస్తున్న ప్రేమ‌ని చూస్తుంటే నిజంగా ఆనందంగా అనిపిస్తోంది. ఇది ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది. ఇలాంటి చిరస్మరణీయమైన సినిమాను నాకిచ్చినందుకు రాజమౌళిగారికి చాలా పెద్ద థాంక్యూ. ఇప్పటికీ ఈ సినిమా వచ్చి 10 సంవత్సరాలైందంటే నమ్మలేకపోతున్నా’’ అని తెలిపాడు చెర్రీ. అయితే అక్కడి అభిమానులు సినిమాలోని పాత్రల గెటప్‌లు, ప్లకార్డులతో థియేటర్లలో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రాంచరణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలో దేవ్‌గిల్, శ్రీహరి కీలక పాత్రల్లో నటించారు. . చెర్రీ ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. యూర‌ప్‌లో 25 రోజుల పాటు చిత్ర షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌ తదితరులు న‌టిస్తున్నారు.

2845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles