ఉపాస‌న, సితారల‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపిన చెర్రీ

Sat,July 21, 2018 10:14 AM
ram charan sends birthday wishes to upasana, sitara

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న అర్ధాంగి ఉపాస‌న బ‌ర్త్‌డే(జూలై 20)ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశాడు. ఇంటిని అందంగా అలంక‌రించి ఉపాస‌న‌తో కేక్ క‌ట్ చేయించాడు. నువ్వు నా ప‌క్క‌న ఉన్నంత వ‌ర‌కు ఎప్పుడు సంతోషంగా ఉంటాను అని చ‌ర‌ణ్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు. అలాగే అదే రోజు మ‌హేష్ గారాల పట్టి సితార ఆర‌వ బ‌ర్త్‌డే కావడంతో వీడియో ద్వారా ఉపాస‌న‌, సితార‌ల‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు మెగా ప‌వ‌ర్ స్టార్. ఈ సారి క‌లిసిన‌ప్పుడు మంచి పాట నాకు వినిపించాలని చ‌ర‌ణ్ త‌న వీడియో ద్వారా సితార‌కి చెప్పాడు. అంతేకాదు సితార‌కి బ‌ర్త్‌డే గిఫ్ట్స్‌గా బ‌ర్డ్స్‌ని పంపించారు. అవి త‌న‌కెంతో న‌చ్చాయని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ఉపాస‌నికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన సితార త‌న‌కి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినందుకు చ‌ర‌ణ్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉండ‌గా, మ‌హేష్ త‌న 25వ సినిమాని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు.

1845
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS