జనసేన ఓటమిపై స్పందించిన రామ్ చరణ్

Fri,May 24, 2019 05:11 PM

ఏపీలో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 175 సీట్లలో ఒకే సీటు గెలుచుకోవడం.. పవన్ కల్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాకలోనూ ఓడిపోవడం, తన అన్న నాగబాబు నరసాపురం ఎంపీగా పోటీ చేసి కూడా ఓడిపోవడంతో జనసేనకు కోలుకోలేని దెబ్బ తాకింది.


ఈనేపథ్యంలో జనసేన ఓటమిపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా ఆయన స్పందించారు. గొప్ప నాయకులు ఎప్పటికీ తమ లక్ష్యం కోసమే పోరాడుతారన్నారు.

వాళ్ల పాత్ర ఏంటి.. పదవి ఏంటి అనేది ముఖ్యం కాదు.. వాళ్ల లక్ష్యం ఏంటి అనేదే ముఖ్యం. గొప్ప గొప్ప నాయకులు.. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం పోరాడుతారు తప్పితే తాము నాయకులు కావడం కోసం కాదు. నిజాయితీతో సమాజంలో మార్పు కోసం పోరాడితే.. ఆ పోరాటం ఎన్నటికీ వృథా కాదు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి పార్టీ కోసం ఎంతో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు... అంటూ పోస్ట్ పెట్టారు రామ్ చరణ్.

రామ్ చరణ్ పోస్ట్‌నే ఆయన భార్య ఉపాసన కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఒక్కసారి నాయకుడైతే ఆయన ఎప్పటికీ నాయకుడే అంటూ ఆమె కూడా ట్వీట్ చేశారు.


7760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles