ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై స్పందించిన రామ్ చ‌ర‌ణ్‌

Wed,September 19, 2018 09:13 AM
Ram Charan Responds On Honor Killing Incident

న‌ల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ప్ర‌ణ‌య్ హ‌త్య ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రేమించిన కార‌ణంగా అత్యంత దారుణంగా కిరాయి హంత‌కునితో ప్ర‌ణ‌య్‌ని చంపిచడంపై రాజ‌కీయ ప్ర‌ముఖులే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే రామ్ ,మంచు మనోజ్‌, చిన్న‌యి శ్రీ పాద త‌దిత‌రులు ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేయ‌గా, తాజాగా రామ్ చ‌ర‌ణ్ త‌న ఫేస్ బుక్ పేజ్‌లో మిర్యాల‌గూడ హ‌త్య‌పై స్పందించారు. ప‌రువు హ‌త్య న‌న్ను తీవ్రంగా క‌లచి వేసింది. వ్య‌క్తి ప్రాణం తీసే ప‌రువు ఎక్క‌డ ఉంది ?? అస‌లు మ‌న స‌మాజం ఎక్క‌డికి వెళుతుంది. బాధితురాలు అమృత వ‌ర్షిణికి నా సానుభూతి తెలియ‌జేస్తూ, మృతుడు ప్ర‌ణ‌య్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను అని చ‌ర‌ణ్ త‌న ఫేస్ బుక్ పేజ్‌లో కామెంట్ పెట్టారు. అంతేకాదు ప్రేమకు హద్దులు లేవు (#Lovehasnoboundaries), ప్రణయ్‌కు న్యాయం జరగాలి (#justiceforpranay) అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా చెర్రీ తన పోస్ట్‌లో జత చేశారు. భర్త రామ్ చరణ్ పోస్టుపై ఉపాసన కూడా స్పందించారు. ‘బాధాకరమైన స్థితి. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామంటూ’ ప్రశ్నిస్తూ చరణ్ పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఆమె ట్వీట్ చేశారు. ప్రేమకు హద్దులు లేవు, ప్రణయ్‌కు న్యాయం జరగాలి అనే హ్యాష్ ట్యాగ్స్‌ పోస్ట్ చేశారు. మరోవైపు అమృత క్రియేట్ చేసిన ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ఫేస్‌బుక్ పేజీకి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రణయ్‌కు న్యాయం జరగాలని, నిందితులను ఉరిశిక్ష విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.4373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles