మెగా అల్లుడికి చ‌ర‌ణ్, ఉపాస‌న ప్ర‌శంస‌లు

Sat,July 14, 2018 10:11 AM
ram charan praise kalyan dev performance

విజేత సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విజేత చిత్రం జూలై 12న గ్రాండ్‌గా విడుద‌లైంది.ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అర‌వింద్ స్పెష‌ల్ షో చూసి చిత్ర యూనిట్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇక తాజాగా రామ్ చ‌ర‌ణ్ త‌న బావ కళ్యాణ్ దేవ్‌కి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించాడు. ఉపాస‌న కూడా టీంని ప్ర‌శంసించింది. తండ్రి , కొడుకుల మధ్య సాగే కథ నేపథ్యంలో తెరకెక్కిన విజేత‌ చిత్రం కుటుంబ‌ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకుళుతున్న ఈ చిత్రంలో క‌థ‌తో పాటు ముర‌ళీ శ‌ర్మ న‌ట‌న చాలా బాగుంద‌ని చెబుతున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకం ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది.


2791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles