న్యూ లుక్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌

Sat,March 17, 2018 11:23 AM
Ram Charan new look goes viral

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మార్చి 30న రంగ‌స్థ‌లం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర‌లో చెవిటి వ్య‌క్తిగా క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు చెర్రీ. ఈ పాత్ర కోసం భారీ గ‌డ్డం పెంచుకొని మొన్న‌టి వ‌ర‌కు డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించిన చెర్రీ తాజాగా న్యూ లుక్ తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. జోష్ ఫాంట‌సీ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో హాజ‌రైన రామ్ చ‌ర‌ణ్ క్లీన్ షేవ్‌తో కొత్త‌గా క‌నిపించాడు. చెర్రీని చూసి అక్క‌డి వారందరు తెగ మురిసిపోయారు. మ‌రి కొద్ది రోజుల‌లో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్నాడు చెర్రీ. ఇందులో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఆగ‌స్ట్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేందర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం సైరాని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌పై నిర్మిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.


5420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles