చ‌ర‌ణ్ సినిమా టైటిల్స్ విష‌యంలో వ‌చ్చిన క్లారిటీ..!

Tue,May 1, 2018 12:08 PM
ram charan movie titles are fake

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం విజ‌యోత్సాహంతో బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 12వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే . ప్ర‌స్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుండ‌గా, బోయ‌పాటి కొన్ని యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వివేక్‌ ఒబెరాయ్, ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. డీవివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీకి రాజ‌వంశ‌స్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇంత వ‌ర‌కు చిత్రానికి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేయ‌లేద‌ని, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌వన్నీ అవాస్త‌వాలేనంటూ స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

2020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS