ప్ర‌భాస్ ప్లేస్‌లో రామ్ చ‌ర‌ణ్‌.. కొన‌సాగుతున్న న్యూ ట్రెండ్

Tue,April 24, 2018 11:25 AM
ram charan guest for na peru surya pre release

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల టాలీవుడ్ లో కొత్త‌ ట్రెండ్ సృష్టించాడు. త‌న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక‌కి ఎన్టీఆర్‌ని గెస్ట్‌గా పిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు. ఒక స్టార్ హీరో సినిమాకి మ‌రో స్టార్ హీరో రావ‌డం ఈ మ‌ధ్య కాలంలో ఇదే తొలి సారి కావ‌డంతో ఈ ట్రెండ్ టాలీవుడ్‌లో కొన‌సాగుతుందా అనే అనుమానం అంద‌రిలో ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక‌కి ప్రభాస్ గెస్ట్‌గా వ‌స్తాడ‌ని ఈ మ‌ధ్య జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కాని మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రితం గ‌చ్చిబౌలిలో ఈ నెల 29న జ‌ర‌గ‌నున్న ప్రీ రిలీజ్ వేడుక‌కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా రాబోతున్నార‌ని ప్ర‌క‌టించారు. అంటే మ‌హేష్ స్టార్ట్ చేసిన ట్రెండ్ టాలీవుడ్‌లో కొన‌సాగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఏప్రిల్ 22న ఈ చిత్రం ప‌శ్చిమ గోదావరి జిల్లా .. తాడేపల్లి గూడెం సమీపంలోని 'మిలటరీ మాధవరం' లో ఆడియో వేడుక జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే . వ‌క్కంతం వంశీ తెర‌కెక్కించిన నా పేరు సూర్య చిత్రం మే 4న విడుద‌ల కానుండ‌గా, ఈ చిత్రంలో బ‌న్నీ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌థానాయిక‌గా అను ఎమ్మాన్యుయేల్ న‌టించింది. విశాల్ -శేఖ‌ర్ చిత్రానికి సంగీతం అందించారు.

6987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS