చెర్రీ మ‌రోసారి గాయ‌ప‌డ్డాడంటూ ప్రచారం..

Wed,July 24, 2019 08:48 AM
Ram Charan gets injured on the sets of the movie again

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌న్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ సీన్ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో చ‌ర‌ణ్ గాయ‌ప‌డడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. మూడు వారాల త‌ర్వాత ఆయ‌న పూర్తిగా కోలుకోవ‌డంతో మ‌ళ్ళీ షూటింగ్ ప్రారంభించారు. అయితే తాజాగా ఆయ‌న మ‌రోసారి గాయ‌ప‌డ్డాడంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అయింది. దీంతో అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు ఆరాలు తీసారు. ఈ నేప‌థ్యంలో పీఆర్ఓ వంశీ కాక త‌న ట్విట్ట‌ర్ ద్వారా పుకార్ల‌కి పులిస్టాప్ పెట్టారు. రామ్ చ‌ర‌ణ్ గాయ‌ప‌డ్డాడంటూ వ‌స్తున్న వార్త‌ల‌లో వాస్త‌వం లేదు. ఆయ‌న ఎంతో సుర‌క్షితంగా ఉన్నారు. నిన్న, ఈ రోజు షూటింగ్‌లో కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అనంతరం చిత్ర యూనిట్ పుణే వెళ్లనున్నట్లు సమాచారం. . ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.


738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles