తన భార్య‌ని చూసి గ‌ర్వంగా ఉంద‌న్న రామ్ చ‌ర‌ణ్‌

Sun,April 21, 2019 07:20 AM
ram charan appreciates upasana

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం న‌టుడిగానే కాదు నిర్మాత‌గాను రాణిస్తున్నాడు. ఆయ‌న ప్ర‌స్తుతం సైరా చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వహ‌రిస్తూ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే త‌న‌కి అన్ని వేళ‌లా స‌పోర్ట్‌గా ఉంటూ ముందుకు న‌డిపిస్తున్న ఉపాస‌న‌కి ఈ యేడాదికిగానూ దాదా సాహెబ్ ఫాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డు దక్క‌డంతో రామ్ చ‌ర‌ణ్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపాడు. ప్రియ‌మైన ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు అని తెలిపారు చెర్రీ. అయితే త‌న‌ని స‌పోర్ట్ చేస్తూ ఈ అవార్డు ద‌క్క‌డానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికి ధన్య‌వాదాలు తెలిపింది ఉపాస‌న‌. నా చుట్టూ ఉండి, ప్రతిరోజూ మెసేజ్‌లతో నాలో స్ఫూర్తి నింపుతూ.. ముందుకు నడిపిస్తున్న మంచి మనసున్న వారందరికీ ఈ అవార్డ్ అంకితం ఇస్తున్నాను. న‌న్ను ఎల్ల‌ప్పుడు స‌పోర్ట్ చేసిన నా కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ఉపాస‌న త‌న పోస్ట్‌ లో తెలిపింది.

4156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles