ముంబైలో కియారాని క‌లిసిన రామ్ చ‌ర‌ణ్‌..ఫోటోలు వైర‌ల్

Fri,August 2, 2019 10:31 AM
Ram Charan and Kiara Advani snapped together in Mumbai

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. త‌మిళ‌నాడులో మ‌రో కీల‌క షెడ్యూల్ జ‌ర‌ప‌నుండ‌గా, ఆ షెడ్యూల్‌లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌పై ముఖ్య స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ట‌. అయితే షెడ్యూల్ గ్యాప్‌లో కాస్త ఖాళీగా ఉన్న చ‌ర‌ణ్ ఏదో ప‌ని మీద‌ ముంబైకి వెళ్లాడ‌ట‌. అక్క‌డ కియారా అద్వానిని క‌లిసాడు. వారిద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫోటోలో చ‌ర‌ణ్ కోర‌మీసంతో కాస్త మాస్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు. చ‌ర‌ణ్‌, కియారా ఇద్ద‌రు బ్లాక్ డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం విశేషం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెర‌కెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ” చిత్రంలో కియారా అద్వానీ నటించిన విష‌యం విదిత‌మే. కొణిదెల రామ్, సీత అనే పాత్రలలో ఇద్ద‌రు రొమాంటిక్ కపుల్ గా న‌టించి అలరించారు.

2014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles