ఎండ‌ల కార‌ణంగా చ‌ర‌ణ్ మూవీ షూటింగ్ వాయిదా

Thu,May 18, 2017 04:36 PM
ram charan 11th movie shooting postponed

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , లెక్క‌ల మాస్టారు సుకుమార్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో మొదటి షెడ్యూల్ జ‌రుపుకున్న చిత్ర యూనిట్ , ఆ త‌ర్వాత మే 9 నుండి రెండో షెడ్యూల్ జ‌రుపుకుంది.. హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు షూటింగ్ జ‌రుపుకున్న చిత్ర యూనిట్ ఆ త‌ర్వాత మ‌ళ్లీ రాజ‌మండ్రికి వెళ్లింది. మండే ఎండ‌ల్లో చెమ‌ట‌లు కారుస్తూ షూటింగ్ చేశారు. మొద‌టి షెడ్యూల్ లో స‌మంత‌కి వ‌డ దెబ్బ త‌గ‌ల‌డంతో, సినిమా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ భ‌ద్ర‌త‌ని దృష్టిలో ఉంచుకొని షూటింగ్ ని వాయిదా వేశారు. జూన్ 1 నుండి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఏకధాటిగా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోదావ‌రి న‌ది ఒడ్డున భారీ సెట్ వేసి హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ షూట్ చేయ‌నున్న టీం , త‌ర్వాత హైద‌రాబాద్ లోను సెట్ వేసి కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఆగ‌స్ట్ లో సినిమా విడుద‌ల తేదీని ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.

1467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles