ప్రత్యేక గీతానికి ఒకే చెప్పిన రకుల్..!

Mon,July 16, 2018 08:36 PM
Rakulpreet to shake leg in NTR biopic


ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్లు ప్రత్యేక గీతంలో మెరిసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. రకుల్ తాజాగా ప్రత్యేక గీతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిస్తున్నారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నఈ సినిమాలో ఆకు చాటు పిందె తడిసే పాటను తెరకెక్కించనున్నారట. ఈ పాటకు రకుల్‌ ప్రీత్‌ సింగ్ డ్యాన్స్ చేయనున్నట్లు టాక్. వేటగాడు చిత్రంలో ఎన్టీఆర్, శ్రీదే జంట మీద తెరకెక్కించిన ఈ పాట మంచి ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్ తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.

3011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS