జిమ్ లో రకుల్ వర్కవుట్స్..వీడియో వైరల్

Fri,September 7, 2018 09:30 PM
Rakulpreet singh Gym workouts vedio goes viral

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ పై పెట్టే శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తీరిక దొరికినపుడల్లా ఎక్కువ సమయాన్ని జిమ్ కు కేటాయిస్తుంది రకుల్. ఫిట్ గా ఉండాలనుకునే వారి కోసం F45 ట్రైనింగ్ జిమ్ సెంటర్లను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్‌ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. రకుల్ ఉదయం ఇలా ప్రారంభమైతే..చాలా ఉత్సాహంగా ఉంటుందని మనకు తెలుసు అని కామెంట్ పోస్ట్ చేసింది. రకుల్ జిమ్ వర్కవుట్స్ వీడియోను 7లక్షలమందికి పైగా వీక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


6411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS