రిలాక్స్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

Wed,November 22, 2017 03:54 PM
 రిలాక్స్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

చిన్న సినిమాలతో తన సినిమా కెరీర్ ను మొదలుపెట్టిన రకుల్, కథానాయికగా అగ్రస్థానానికి చేరడానికి ఎక్కువ టైం పట్టలేదు. వరుస సినిమాలు చేస్తూ, హిట్స్ ఇస్తుంది. నిరంతరం పనిచేయాలంటే ఎవరికైనా అలసటగానే ఉంటుంది. అదే మాట చెప్పింది రకుల్. నాలుగేళ్లుగా కంటిన్యూగా సినిమాలు చేస్తూ రెస్ట్ లేకుండా ఉన్నాను. అలసిపోయాను. సో.. ఒక నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని డిసైడయ్యాను అని చెప్పుకొచ్చింది.

అదేపనిగా పనిచేస్తూ అలసిపోవడం గమనించిన నా తల్లి దండ్రులు .. విశ్రాంతి తీసుకోవలసిందేనని పట్టుబట్టారంటూ రకుల్ తెలిపింది. అందుకు తాను కూడా సరేనందట. సినిమాల సంఖ్యకి కాకుండా కథల పరంగా, క్వాలిటీ పరంగా ప్రాధాన్యతను ఇవ్వాలని తాను భావిస్తున్నట్టు తెలిపింది. ఇటీవల ఖాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసిందట . అవి సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం ఉందంటుంది రకుల్.

1186

More News

VIRAL NEWS