ర‌కుల్ సోష‌ల్ మీడియా ఎకౌంట్ హ్యాక్‌

Thu,October 25, 2018 08:18 AM
Rakul Preet Singh requests to his fans

డిజిట‌ల్ యుగంలో సోష‌ల్ మీడియా హ‌వా ఏ రేంజ్‌లో సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో ఉండ‌డంతో ఏ విష‌యాన్నైన ఇత‌రుల‌కి సుల‌భంగా చేర్చగ‌లుగుతున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీల‌తో త‌మ మంచి చెడ్డ‌లు మాట్లాడుకునే అవ‌కాశం కూడా సోష‌ల్ మీడియా వ‌ల‌న‌నే ద‌క్కింది. అయితే సైబ‌ర్ నేర‌గాళ్ళు ఇటీవ‌లి కాలంలో సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా ఖాతాల‌ని హ్యక్ చేస్తున్నారు.ఇటీవ‌లే త్రిష ట్విట్ట‌ర్ ఎకౌంట్ హ్యాక్ కాగా తాజాగా హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేయ‌బ‌డింది.

త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయింద‌నే విష‌యం గుర్తించిన ర‌కుల్ త‌న ట్విట్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ఎవ‌రో హ్యాక్ చేసార‌ని తెలుపుతూ అది రిక‌వ‌ర్ అయ్యేంత వ‌ర‌కు అందులో నుండి వ‌చ్చే లింక్స్ పై క్లిక్ చేయ‌డం, మెజేజ్‌లకి స్పందించ‌డం వంటివి చేయ‌కండి అని త‌న ఫాలోవ‌ర్స్‌కి తెలిపింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న ర‌కుల్ .. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రీదేవి పాత్ర పోషిస్తుంది. అలానే కార్తీ 17వ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది.


1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles