బాల‌య్య త‌న‌యుడి స‌ర‌స‌న ర‌కుల్‌..!

Thu,July 19, 2018 11:03 AM
rakul preet singh plays key role in ntr

విశ్వ‌విఖ్యాత న‌ట సార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. జూలై 5న ప్రారంభ‌మైన చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా విద్యాబాల‌న్ టీంతో క‌లిసింది. ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టించ‌నుంది. బీఏ సుబ్బ‌రావు పాత్ర‌ని సీనియ‌ర్ న‌రేష్‌, పింగ‌లి నాగేంద్ర‌రావు పాత్ర‌ని సంజ‌య్ రెడ్డి, నాగిరెడ్డి పాత్ర‌ని ప్ర‌కాశ్ రాజ్ పోషించ‌నుట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానుల‌ని అయోమ‌యానికి గురి చేస్తున్నాయి.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఙ ఆరంగేట్రం ఉంటుంద‌ని స‌మాచారం. చిత్రంలో ఎన్టీఆర్ చిన్న‌త‌నానికి సంబంధించిన స‌న్నివేశాల‌లో మోక్ష‌జ్ఞ క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్‌ కూడా ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని తెలుస్తుండ‌గా, ఆమె పాలు అమ్మే మహిళ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి కొన్ని రొమాంటిక్ సీన్స్ లో కూడా పాల్గొంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కొందరు ఎన్టీఆర్ చిత్రంలో శ్రీదేవి పాత్ర కోసం ర‌కుల్‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

4453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS