ర‌కుల్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన శంక‌ర్

Sun,July 21, 2019 07:43 AM
rakul preet singh plays key role in indian 2

టెక్ మాంత్రికుడు శంక‌ర్ ఇటీవ‌ల 2.0 అనే విజువ‌ల్ వండ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో భార‌తీయుడు 2 సినిమా చేసేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాడు. వచ్చే నెల నుండి చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్రియా భావ‌న శంక‌ర్, ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తుండ‌గా, కీల‌క పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే శంక‌ర్ .. ర‌కుల్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో సిద్ధార్ద్‌, విద్యుత్ జ‌మాల్‌, ఢిల్లీ గ‌ణేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. కాగా, ర‌కుల్ న‌టించిన తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. ఈ మూవీ ఆగ‌స్ట్ 9న విడుద‌ల కానుంది.

1543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles