రేపు లాంచ్ కానున్న ర‌కుల్ సోద‌రుడి మూవీ

Sat,February 23, 2019 01:01 PM

ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో పాగా వేయడమే కాదు, ఇక్క‌డ‌ తన హవా చూపిస్తుంది. బ‌డా హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిన ఈ అమ్మడు హైదరాబాద్ లో , వైజాగ్ లో తన బిజినెస్ ని చక్కదిద్దుకుంటుంది. ఇక హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కొని ఇక్కడే మకాం వేసింది. ఇప్పుడు తన తమ్ముడిని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది ర‌కుల్ . ఇప్పటికే తన తమ్ముడిని ఓ షార్ట్ ఫిలింతో పరిచయం చేసింది. చందు హుగ్గిహెళ్ళ దర్శకత్వంలో రూపొందిన రాక్ ఎన్ రోల్ అనే షార్ట్ ఫిలింలో ర‌కుల్ సోద‌రుడు అమన్ ప్రధాన పాత్ర పోషించారు.


ర‌కుల్ సోద‌రుడు అమ‌న్ వెండితెర‌ ఆరంగేట్రం ‘సెడిషన్‌’ అనే హాలీవుడ్ చిత్రంతో జ‌రిగింది. ఇందులో సీఐఏ ఏజెంట్‌ పాత్రలో అమ‌న్ క‌నిపించాడు . ఈ మూవీ ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ విడుదల అయింది. సమ్మర్‌ బోధి నిక్స్‌,, జోయెల్‌ మరాక్కోలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో ఈ సినిమా విడుదల అయింది. అయితే ఇప్పుడు తెలుగులోను ర‌కుల్ సోద‌రుడు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం అమ‌న్ తెలుగు సినిమా ర‌జిని ఫిల్మ్ కార్పొనేష‌న్‌పై దాస‌రి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. రేపు ఉద‌యం 10గం.ల‌కి ఈ చిత్ర లాంచింగ్ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌ర‌గ‌నుంది.3073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles