బాలీవుడ్‌లో మ‌రో అవ‌కాశం అందుకున్న ర‌కుల్‌

Thu,November 15, 2018 08:25 AM
rakul Preet Singh another Bollywood movie fixed

టాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్ పొంది ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో బిజీ అయింది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ప్ర‌స్తుతం కార్తీ స‌ర‌స‌న దేవ్ అనే చిత్రంలో న‌టిస్తుండ‌గా, ఎన్‌జీకే అనే చిత్రంలో సూర్యతో జ‌త‌క‌ట్టింది. అయితే ర‌కుల్ దృష్టి బాలీవుడ్‌పై కూడా ఉండడంతో అప్ప‌ట్లో అయ్యారి అనే సినిమాతో హిందీ ఇండ‌స్ట్రీకి ఆరంగేట్రం ఇచ్చింది. ఈ సినిమా ర‌కుల్‌ని సంతృప్తి ప‌ర‌చ‌క‌పోవ‌డంతో మ‌రో సారి అక్క‌డ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మర్జావాన్‌ సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రంలో రెండో సారి సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో రెండో సారి జ‌త‌క‌ట్ట‌నుంది ర‌కుల్‌. మిల‌ప్ మిల‌న్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌ర్జావాన్ సినిమాని టీ సిరీస్‌తో క‌లిసి నిఖిల్ అద్వాని నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. వ‌చ్చే ఏడాది అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

1045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles