మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆఫ‌ర్ అందుకున్న ర‌కుల్‌

Fri,November 8, 2019 11:07 AM

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఒక్క మంచి హిట్ కొట్ట‌క‌పోయిన వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతుంది ర‌కుల్ ప్రీత్ సింగ్. తెలుగులో మ‌న్మ‌థుడు 2 ఆమె చివ‌రి చిత్రం కాగా , ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్‌తో ఓ చిత్రం, క‌మ‌ల్‌తో ఓ చిత్రం చేస్తుంది. ఇక బాలీవుడ్‌లో అయ్యారి సినిమాతో అడుగు పెట్టిన రకుల్ ఇటీవ‌ల దేదేప్యార్ దే అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా అంత‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. ర‌కుల్ న‌టించిన తాజా హిందీ చిత్రం మ‌ర్‌జావాన్. రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్ద్ మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానుంది. క‌ట్ చేస్తే బాలీవుడ్ లో మ‌రో ఆఫ‌ర్ అందుకుంది రకుల్‌. కాశివ్ నాయ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలో అర్జున్ క‌పూర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. రొమాంటిక్ ప్రేమ క‌థగా రూపొంద‌నున్న ఈ చిత్రం పంజాబ్, లాస్ ఏంజెల్స్‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది.

781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles