చాలా గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లో బిజీ అవుతున్న ర‌కుల్‌

Sat,February 9, 2019 09:10 AM
rakul next with bala krishna

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో స్టార్ హీరోల‌తో న‌టించిన అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఉన్న ఈ న‌టి ఆ మ‌ధ్య తెలుగులో వ‌రుస సినిమాలు చేసింది. ఇందులో కొన్ని డివైడ్ టాక్స్ తెచ్చుకున్నాయి. దీంతో త‌మిళం, హిందీ ప‌రిశ్ర‌మ వైపు దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం మ‌ళ్ళీ తెలుగులో వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుంది. ఇప్ప‌టికే వెంకీమామ చిత్రంలో ఓ క‌థానాయిక‌గా ఎంపికైన ర‌కుల్ ప్రీత్ సింగ్ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళనున్న బాల‌య్య‌- బోయ‌పాటి మూవీ చిత్రంలోను క‌థానాయిక‌గా సెల‌క్ట్ అయింద‌ని అంటున్నారు.

సింహా, లెజెండ్ త‌ర్వాత బాల‌కృష్ణ‌- బోయపాటి శీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానముండ‌గా, కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ఓ హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌గా రకుల్ నటించబోతోందట. అంటే 'సరైనోడు', 'జయజానకి నాయక' తరువాత బోయపాటి డైరెక్షన్‌లో ర‌కుల్ న‌టిస్తున్న మూడో చిత్రం ఇదే అవుతుంది. మ‌రోవైపు యన్.టి.ఆర్. కథానాయకుడులో ఆకుచాటు పిందె త‌డిసే సాంగ్‌లో బాల‌కృష్ణ‌తో క‌లిసి స్టెప్పులేసింది ర‌కుల్. ఇప్పుడు బోయ‌పాటి చిత్రంలో బాల‌య్య‌తో క‌థానాయిక‌గా న‌టిస్తుందని తెలుస్తుంది. మ‌రి ఈ వార్త‌ల‌లో నిజ‌మెంతో రానున్న రోజుల‌లో అర్ధ‌మ‌వుతుంది. ర‌కుల్ చివ‌రిగా స్పైడ‌ర్ అనే తెలుగు చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించింది.

2418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles