20 నిమిషాలకి కోటి రెమ్యున‌రేష‌న్..!

Fri,October 12, 2018 11:57 AM
rakul increased remuneration for ntr movie

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ చిత్రంలో శ్రీదేవి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ర‌కుల్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వేట‌గాడు సినిమాలో ఫేమ‌స్ సాంగ్ అనే పాట‌ చిత్రీక‌ర‌ణ కూడా ఇప్ప‌టికే పూర్తైంద‌ని అంటున్నారు. ఇందులో బాల‌కృష్ణ‌, రకుల్ లు ఎన్టీఆర్‌, శ్రీదేవిలా అద‌ర‌గొట్టార‌ని తెలుస్తుంది. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పాపుల‌ర్ సాంగ్స్ కూడా త్వ‌ర‌లో షూట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. అయితే శ్రీదేవి పాత్ర పోషిస్తున్న ర‌కుల్ రెండో భాగం మ‌హానాయ‌కుడులో క‌నిపించ‌నుందని టాక్. ఇందులో 20 నిమిషాలు మాత్ర‌మే ర‌కుల్ పాత్ర ఉండ‌గా, దీని కోసం కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుండి తెలుస్తుంది.

ఎన్టీఆర్ చిత్రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతుండ‌గా తొలి భాగం క‌థానాయకుడు పేరుతో జ‌న‌వ‌రి 9న విడుదల కానుంది. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా దివి సీమీలో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తుండ‌గా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వ‌రిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు అని స‌మాచారం. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

3780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles