తమన్నా రూట్లోనే ఆ ఇద్దరు భామలు ..!

Fri,December 2, 2016 07:02 AM
rakul and amala paul in queen remake

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించిన క్వీన్ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. క్వీన్ తో కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుని.. తన ఇమేజ్‌ను అమాంతం పెంచేసుకుంది. ఇప్పుడు సూపర్ హిట్ ‘క్వీన్’ మూవీ తమిళంలో రీమేక్‌ కానుండగా కంగనా పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తోంది. తమన్నా స్నేహితురాలి పాత్రలో కోలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ నటించనుందని టాక్. ఇదిలా ఉంటే క్వీన్ మూవీని ఇతర భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారట. మలయాళంలో అమలా పాల్ ప్రధాన పాత్ర పోషించనుండగా, కన్నడలో రకుల్ ప్రీత్ నటిస్తుందట. అయితే తమిళం, మలయాళ భాషలలో తెరకెక్కనున్న ఈ రీమేక్ ని రేవతి డైరెక్ట్ చేయనుండగా, కన్నడలో మాత్రం విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తెరకెక్కిస్తాడనే టాక్ నడుస్తోంది. మరి తెలుగు భాషలో ఏ హీరోయిన్ నటిస్తోందనే దానిపై పూర్తి క్లారిటీ లేదు.

1971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles