నాని, నాగ్ స‌ర‌స‌న అందాల భామ‌లు..!

Thu,March 22, 2018 10:01 AM
rakul, amala joins with nag and nani

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీరామ్ ఆదిత్య ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్ట‌నున్నారు నిర్మాత‌లు. వినోద ప్ర‌ధానంగా ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ మూవీలో క‌థానాయిక‌లు ఎవ‌రు అనే దానిపై కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం నాగార్జున స‌ర‌స‌న అమ‌లాపాల్ క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా, నాని స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఎంపికైందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక‌ చిత్రానికి సంబంధించి మణిశర్మ సంగీత సారథ్యంలో అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. వైజ‌యంతి బేన‌ర్‌లో అశ్వినీద‌త్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి స‌త్యానంద్ అద్భుత‌మైన మాట‌లు అందించార‌ని తెలుస్తుంది. నాగార్జున ప్ర‌స్తుతం వ‌ర్మ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఆఫీస‌ర్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, నాని కృష్ణార్జున యుద్ధం చేస్తున్నాడు.

2533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles