నేనంటే భయానికే భయం..రాక్షసుడు ట్రైలర్‌

Thu,July 18, 2019 06:59 PM
Rakshasudu Official Trailer revealed today

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాక్ష‌సుడు. రైడ్, వీర చిత్రాల ఫేమ్ రమేష్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘నేనంటే భయానికే భయం..నన్ను పట్టుకోవాలనుకోకు. పట్టుకుందామనుకున్నా అది నేనవ్వను..మనం వెతుకుతున్నవాడు రేపిస్టో..కిడ్నాపరో..లేకపోతే వన్ సైడ్ లవరో కాదు..పథకం ప్రకారం హత్యలు చేసే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి’ అంటూ వచ్చే డైలాగ్స్ తో ప్రారంభమయే ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ గా కొనసాగుతోంది.

కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ మూవీ తమిళ హిట్ చిత్రం రాచ్చసన్ కు తెలుగులో రీమేక్. రాక్షసుడు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. హ‌వీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్‌లో ఏ స్టూడియో పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles