అలరిస్తున్న రాక్ష‌సుడు టీజ‌ర్

Sat,June 1, 2019 10:36 AM
Rakshasudu Movie teaser released

సీత చిత్రంతో రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం హ‌వీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్‌లో ఏ స్టూడియో పతాకంపై రాక్ష‌సుడు అనే చిత్రం చేస్తున్నాడు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన రాచ్చసన్ ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతుంది. రైడ్, వీర చిత్రాల ఫేమ్ రమేష్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ విడుద‌ల చేసిన టీం కొద్ది సేప‌టి క్రితం టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో శ్రీనివాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. ఈ చిత్రం బెల్లంకొండ‌కి మంచి హిట్ ఇస్తుందని టీం భావిస్తుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జూలై 18న విడుద‌ల కానున్న చిత్ర టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి .

2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles