నేను చ‌చ్చినా కూడా జ‌నం న‌మ్మేలా లేరు: రాఖీ సావంత్

Tue,November 13, 2018 12:45 PM
Rakhi Sawant discharged from hospital

వివాదాల‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలిచే రాఖీ సావంత్ రీసెంట్‌గా హరియాణాలోని పంచకులలో జరిగిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(సీడబ్ల్యూఈ) పోటీ సందర్భంగా జరిగిన ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సీడబ్ల్యూఈ పోటీకి వెళ్లిన రాఖీ సావంత్ రెజ్ల‌ర్‌కి స‌వాల్ విసిరింది. దాంతో ఓ రెజ్ల‌ర్ రాఖీకి పంచ్ ఇవ్వ‌డంతో గింగ‌రాలు తిరిగి కింద ప‌డింది. రింగ్ నుండి బ‌య‌ట‌కి కూడా రాలేని స్థితిలో ఉన్న రాఖీని నిర్వాహ‌కులు వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని చెప్పిన వైద్యులు కొద్ది సేప‌టి క్రితం డిశ్చార్జ్ చేశారు. ఈ సంద‌ర్భంలో భావోదేవ్వాగానికి గురైన హాట్ భామ మా అమ్మ ద‌గ్గ‌ర‌కి వెళ్ళాల‌నుందంటూ పేర్కొంది. నేను ఇలా చేసింది ప‌బ్లిక్ స్టంట్ కోసం కాదు. నేను చ‌చ్చినా కూడా జ‌నం న‌మ్మేలా లేరు క‌దా అని రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడ‌డం గ‌మన‌ర్హం. ఆ మ‌ధ్య మ‌న‌దేశంలో మీటూ ఉద్య‌మాన్ని స్టార్ట్ చేసిన త‌నుశ్రీ దత్తా మీద సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి రాఖీ సావంత్ హాట్ టాపిక్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

2395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles