యాసిడ్ బాధితురాలి బ‌యోపిక్‌లో రాజ్‌కుమార్ రావు

Sun,December 16, 2018 09:58 AM
Rajkummar Rao Joins The Cast Of Laxmi Agarwal movie

బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతూనే ఉంది. క్రీడా, రాజ‌కీయ‌,సినిమా రంగాల‌కి సంబంధించిన ప్ర‌ముఖుల జీవిత నేప‌థ్యంలోనే కాక ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచిన ప‌లువురి జీవిత నేప‌థ్యంలోను సినిమాలు చేస్తున్నారు. పదమూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జ‌రిగిన యాసిడ్ దాడిలో గాయ‌ప‌డ్డ లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాల‌ని బావించారు బాలీవుడ్ మేక‌ర్స్ . ఈ చిత్రంలో దీపికా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచిన ఆమె జీవితంకి సంబంధించిన చిత్రాన్ని మేఘ‌నా గుల్జార్ తెరకెక్కించ‌నున్నార‌ట‌. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో దీపికా ప‌దుకొణే న‌టించనుంది. సినిమాలో యాసిడ్ బాధితుల గురించి లార్జ్ స్కేల్‌లో చూపించాల‌ని ద‌ర్శ‌కులు భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నార‌ట‌. దీపికాకి జోడీగా రాజ్‌కుమార్ రావు పేరుని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇటీవ‌ల ఆయ‌న‌ని క‌లిసి స్క్రిప్ట్ వివ‌రించ‌గా, దీనికి రాజ్‌కుమార్ రావు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంతో దీపికా ప‌దుకొణే నిర్మాత‌గా ప‌రిచ‌యం కానుంద‌ని అంటున్నారు.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles