త్రీఇడియట్స్ సీక్వెల్ పై స్పష్టత ఇచ్చిన హిరాణీ

Wed,June 20, 2018 07:22 PM
Rajkumar hirani ready to make 3 Idiots sequel


ముంబై: అమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్ జోషి కాంబినేషన్‌లో వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. బొమన్ ఇరానీ కీలక పాత్రలో నటించాడు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్. ఈ సూపర్‌హిట్ సినిమా సీక్వెల్‌ కి అంతా సిద్దమైంది. త్రీ ఇడియట్స్ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు రాజ్‌కుమార్ హిరానీ తెలిపాడు.

‘నేను ఖచ్చితంగా త్రీ ఇడియట్స్ సీక్వెల్ తీస్తా. రచయిత జోషి, నేను కొన్ని రోజుల కిందనే స్క్రిప్ట్ పనులను ప్రారంభించాం. కథను డెవలప్ చేసేందుకు కొంత సమయం పడుతుంది. సీక్వెల్‌ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తామని’ చెప్పాడు. రూ.55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన త్రీ ఇడియట్స్ రూ.400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

2191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS