పెళ్లి కూతురు కాబోతున్న రజ‌నీ కుమార్తె

Mon,February 4, 2019 02:54 PM
Rajinikanths daughter Soundarya confirms wedding with Vishagan

హైద‌రాబాద్: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య రెండో పెళ్లి చేసుకోనున్న‌ది. ఈ విష‌యాన్ని ఆమెనే తన ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వెల్ల‌డించింది. వ్యాపార‌వేత్త విశాగ‌న్ వ‌ణ‌న్‌గ‌ముడిని ఈనెల‌లోనే పెళ్లి చేసుకోనున్న‌ట్లు చెప్పింది. మ‌రో వారం రోజుల్లో తాను పెళ్లి కూతురిలా క‌నిపించ‌బోతున్నాని, వేద విశాగ‌న్ సౌంద‌ర్య‌గా మార‌బోతున్న‌ట్లు ఆమె ట్వీట్ చేసింది. ఈనెల 11వ తేదీన చెన్నైలో వివాహ వేడుక జ‌ర‌గ‌నున్న‌ది. ఈనెల 9వ తేదీన పెళ్లి సంబ‌రాలు మొద‌లుకానున్న‌ట్లు తెలుస్తోంది. 2010లో వ్యాపార‌వేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను సౌంద‌ర్య పెళ్లి చేసుకున్న‌ది. ఆ త‌ర్వాత వాళ్లు 2016లో విడాకులు తీసుకున్నారు. సౌంద‌ర్య‌కు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొచ్చియాడ‌న్‌, వీఐపీ 2 చిత్రాల‌కు ఆమె డైర‌క్ట‌ర్‌గా చేశారు. గ‌త ఏడాది రిలీజైన వంజ‌గ‌ర్ ఉలాగ‌మ్ సినిమాలో విశాగ‌న్ న‌టించాడు. మ‌రికొన్ని చిత్రాల్లో చిన్న పాత్ర‌లు పోషించాడు. కేవ‌లం కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు మాత్ర‌మే పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌వుతార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.



2778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles