రజినీకాంత్ భార్య కేసు విచారణను ఎదుర్కోవాల్సిందే: సుప్రీం

Wed,July 11, 2018 07:02 AM
Rajinikanth wife in trouble Supreme Court orders trial against in cheating case

చెన్నై : తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ సతీమణి లతకు సుప్రీంకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. మోసం చేసిన కేసులో పోలీసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2014లో కొచ్చాడయాన్ (తెలుగులో విక్రమసింహ) చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన లత హామీమేరకు బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పు ఇచ్చింది.

అప్పులో రూ.8.70 కోట్లను తిరిగి చెల్లించారు. వడ్డీసహా ఇంకా రూ.6.20 కోట్లను చెల్లించకపోవడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బకాయి మొత్తాన్ని 12 వారాల్లోగా చెల్లించాలని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు లతను ఆదేశించింది. ఎందుకు చెల్లించలేదని, ఎప్పుడు చెల్లిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే, దీనికి ఆమె స్పందించలేదు. దీంతో లత కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

1085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles