రజనీకాంత్‌ని న‌య‌న బాయ్ ఫ్రెండ్ డైరెక్ట్ చేయ‌నున్నాడా?

Sun,April 14, 2019 11:06 AM
Rajinikanth ,vignesh shivn pic goes viral

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్భార్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. ఇది ర‌జ‌నీకాంత్‌కి 167వ సినిమా. ముంబైలో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. రెండు నెల‌లో ఈ సినిమాని పూర్తి చేయాల‌ని మురుగ‌దాస్ భావిస్తున్నాడ‌ట‌. ఈ చిత్రం త‌ర్వాత ర‌జ‌నీకాంత్ .. కె ఎస్ రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, యంగ్ డైరెక్ట‌ర్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేసేందుకు సుముఖంగా ఉన్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ర‌జ‌నీకాంత్‌, న‌య‌న బాయ్ ఫ్రెండ్ ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రానుందా అని అభిమానులు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం మొద‌లు పెట్టారు. కాని అస‌లు విష‌యం ఏంటేంటే ‘చంద్రముఖి’, ‘కుశలన్‌’ చిత్రాల తరువాత ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి న‌య‌నతార ద‌ర్భార్ చిత్రంలో న‌టిస్తుంది. చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు న‌య‌న‌తార త‌న ప్రియుడితో క‌లిసి ముంబై వెళ్లింది. ఈ సంద‌ర్భంలో విఘ్నేష్ శివ‌న్..ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ఓ ఫోటో దిగారు. ఈ ఫోటోనే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

1679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles