రెండు నెల‌ల త‌ర్వాత ట్వీట్ చేసిన ర‌జ‌నీకాంత్

Sun,October 21, 2018 08:01 AM
rajinikanth tweets after two monnths

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆరుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఎనర్జిటిక్‌తో సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం త‌న 165వ చిత్రం పేట్టాతో బిజీగా ఉండ‌గా కొద్ది రోజుల పాటు ఈ మూవీ చిత్రీక‌ర‌ణ వార‌ణాసిలో జ‌రిగింది. అనుకున్న స‌మ‌యానికంటే 15 రోజుల ముందే షెడ్యూల్ పూర్తి కావ‌డంతో త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు త‌లైవా. త‌న ట్విట్ట‌ర్‌లో పేట్టా సినిమాని అనుకున్న స‌మ‌యానికంటే ప‌దిహేను రోజుల ముందే పూర్తి చేసాం అని తెలిపారు. ఇది టీమ్ స‌మిష్టి కృషి అన్నారు. ఆగ‌స్ట్ 19న ట్వీట్ చేసిన ర‌జ‌నీ మ‌ళ్ళీ అక్టోబ‌ర్ 19న ట్వీట్ చేయ‌డం విశేషం.

ర‌జనీ న‌టిస్తున్న పేట్టా సినిమాని కార్తీక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కిస్తుండ‌గా ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని టాక్‌. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

పేట్టా షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నై చేరుకున్న ర‌జ‌నీకాంత్‌ని మీటూ ఉద్య‌మంతో పాటు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశం గురించి విలేకరులు ప్ర‌శ్నించారు. ఇందుకుగాను ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ..మీటూ ఉద్య‌మం స‌క్ర‌మ మార్గంలో వెళితే మంచిది. దానిని దుర్వినియోగం చేయ‌కూడ‌దు అని అన్నారు. ఇక శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో మ‌హిళ‌ల ప్ర‌వేశంపై మాట్లాడిన ఆయ‌న సుప్రీం కోర్టుని తీర్పుని గౌర‌వించి వారికి స‌మాన బాధ్య‌త క‌లిపించాలి. అయితే దేవాలయాల సంప్రదాయాలను, నియమాలను కూడా గౌరవించాలన్నది నా మనవి అని ర‌జ‌నీ పేర్కొన్నారు.

2511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles