కొత్త సినిమాకు రజినీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Thu,May 3, 2018 06:10 PM
Rajinikanth to get 65 crore remuneration for his next


చెన్నై: తమిళసూపర్‌స్టార్ రజినీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. రజినీకాంత్ సినిమా అంటే మార్కెట్‌లో ఏ రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజినీకాంత్‌ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. రజినీకాంత్ ఈ సినిమాకు 65 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రజినీకాంత్ ఆసియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా నిలవనున్నాడు. మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే రజినీ రెమ్యునరేషన్ పై స్పష్టత వస్తుందేమో చూడాలి.

4346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS