లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేయను: ర‌జ‌నీకాంత్

Sun,February 17, 2019 11:15 AM
Rajinikanth says wont contest upcoming Lok Sabha elections

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొన్నాళ్ళ క్రితం తాను రాజ‌కీయాల‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించ‌ని ర‌జ‌నీకాంత్ రానున్న లోక్ స‌భ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తాడా లేదా అనే దానిపై అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌న‌ని, ఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. నా పేరు, గుర్తు ఎవ‌రు వాడ‌కూడ‌దు . స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే బ‌ల‌మైన‌, సుస్థిర ప్ర‌భుత్వాన్ని ఎంచుకోండి అని త‌లైవా పేర్కొన్నారు. ర‌జనీ త‌న పార్టీకి ‘రజినీకాంత్ మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్ట‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఏడాది న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ర‌జనీకాంత్ డిసెంబ‌ర్ 12,2018న త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పార్టీ పేరు ప్ర‌క‌టిస్తాడ‌ని అనుకున్న ఇప్పటి వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. ఇంకా పార్టీకి సంబంధించి ముమ్మ‌రంగా ప‌నులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో పార్టీ పేరు ప్ర‌క‌టించ‌డంలో జాప్యం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

1722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles