ర‌జ‌నీకాంత్ లిస్ట్‌లో మ‌రో రెండు సినిమాలు..!

Fri,April 12, 2019 08:20 AM
Rajinikanth READY TO DO ANOTHER CRAZY PROJECTS

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఏడు ప‌దుల వ‌య‌స్సుకి ద‌గ్గ‌ర ప‌డుతున్న కూడా కుర్ర హీరోల‌తో పోటీ ప‌డీ సినిమాలు చేస్తున్నాడు. చివ‌రిగా పేట అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన త‌లైవా ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్భార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. ఇది ర‌జ‌నీకాంత్‌కి 167వ సినిమా. కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ర‌జ‌నీకాంత్ 168,169వ చిత్రాలు కూడా ఓకే అయ్యాయ‌ని టాక్. కె ఎస్ రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, యంగ్ డైరెక్ట‌ర్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేసేందుకు ర‌జ‌నీకాంత్ సుముఖంగా ఉన్నాడ‌ని అంటున్నారు. అయితే ఇందులో ఏ చిత్రం ముందుగా సెట్స్ పైకి వెళుతుంద‌నే దానిపై మాత్రం క్లారిటీ లేద‌ని అంటున్నారు. ఒక‌వైపు త‌న పార్టీ ప‌నుల‌కి సంబంధించిన ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటూనే మ‌రోవైపు వ‌రుస సినిమాలు చేయ‌డం ర‌జనీకే చెల్లింద‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కి దూరంగా ఉన్న ర‌జ‌నీకాంత్ 2021 మే లో తమిళనాడు లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల భరిలో తన పార్టీ ని నిలుపనున్నారట‌.

1020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles