ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడికి నివాళులు అర్పించిన ర‌జ‌నీకాంత్

Tue,April 2, 2019 12:34 PM
rajinikanth praise to mahendran

ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా ఇటు తెలుగు అటు త‌మిళంలో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు జె. మ‌హేంద్ర‌న్ ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి త‌మిళ ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌హేంద్ర‌న్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌కి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో జె.మ‌హేంద్ర‌న్ తెరకెక్కించిన చిత్రాలు చాలా పెద్ద విజ‌యం సాధించాయి. మ‌హేంద్ర‌న్ తెరకెక్కించిన‌ జానీ, ముల్లు ముల్లారం లాంటి సినిమాలతోనే రజినీకాంత్‌‌కు సూపర్‌స్టార్ హోదా వచ్చింది. మ‌హేంద్ర‌న్ చివ‌రిగా రజినీ పేట, ఇళయ దళపతి విజయ్ థేరీ, విజ‌య్ సేతుప‌తి సీతాకాతి చిత్రాల‌లో నటించారు. ర‌చ‌యిత‌గా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న అత్య‌ద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఈ రోజు సాయంత్రం జ‌ర‌గ‌నున్నాయి.


1455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles