సినిమా చూసి క‌డుపుబ్బా న‌వ్వాను: ర‌జనీకాంత్

Tue,August 21, 2018 12:30 PM
Rajinikanth praise after watching Nayanthara Kolamaavu Kokila

సినిమా సినిమాకు డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ఆడియెన్స్ కు కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది నయనతార. ఈ హీరోయిన్ తాజాగా ‘కోలమావు కోకిల’ అనే తమిళ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది . ఈ చిత్రం త‌మిళ‌నాట ఎక్కువ థియేట‌ర్స్ లో విడుద‌లై భారీ విజ‌యం సాధించింది. నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని సినీ సెల‌బ్రిటీలు చూసేందుకు చాలా ఆస‌క్తి చూపుతున్నారు. బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సూపర్‌స్టార్ ర‌జినీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ `కోల‌మావు కోకిల‌` చిత్రాన్ని వీక్షించి మూవీపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించార‌ట‌. ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశాన‌ని, క‌డుపుబ్బా న‌వ్వాన‌ని ర‌జినీ చెప్పిన‌ట్టు నెల్స‌న్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూడా సినిమా చూసి ప్ర‌శంసించార‌ని తెలియ‌జేశాడు. న‌య‌న‌తార ప్ర‌స్తుతం తల అజిత్‌తో పాటు సైరా అనే చిత్రంలోను న‌టిస్తుంది. ‘కోలమావు కోకిల’ చిత్రంలో నటుడు యోగిబాబు ముఖ్య పాత్ర పోషించ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు.3611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS