రెండు పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్న ర‌జ‌నీకాంత్..!

Fri,February 22, 2019 11:04 AM
Rajinikanth plays two roles in 166 movie

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఒక్క పాత్ర‌లో క‌నిపిస్తేనే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు ఉండ‌వు. అలాంటిది రెండు పాత్ర‌ల‌లో ఆయ‌న వెండితెర‌పై సంద‌డి చేస్తే థియేట‌ర్స్ ద‌ద్ద‌రిల్ల‌డం ఖాయం. ఇటీవ‌ల విడుద‌లైన 2.0 చిత్రంలో ర‌జ‌నీకాంత్ రోబోగా, వ‌శీక‌ర‌ణ్ అనే సైంటిస్ట్‌గా రెండు పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పించారు. గ‌తంలోను ఆయ‌న రాజాధిరాజా, అదిశ‌య పిరైవి, ముత్తు, అరుణాచ‌లం చిత్రాల‌లో ద్విపాత్రాభిన‌యం పోషించారు. అయితే ఇప్పుడు ఆయ‌న 166వ చిత్రంలోను రెండు పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా ఓ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. క‌థానాయిక‌గా న‌య‌నతారని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇందులో ర‌జ‌నీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మ‌రి దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles