క‌న్న‌డ దిగ్గ‌జానికి ప్ర‌ముఖుల నివాళులు

Sun,November 25, 2018 11:01 AM
 Rajinikanth pay last respects to Former Union Minister Ambareesh

ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నాయకుడు అంబరీష్ (66) శ‌నివారం సాయంత్రం గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి యావ‌త్ సినీ ప్ర‌పంచాన్ని క‌ల‌చివేసింది. అంబరీష్ భార్య సుమ‌ల‌త తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తోను అల‌రిస్తుంది. అంబ‌రీష్ మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. కంఠీర‌వ స్టేడియంలో అంబ‌రీష్ పార్ధీవ దేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం ఉంచారు. ర‌జ‌నీకాంత్, దేవేగౌడ త‌దిత‌రులు అంబ‌రీష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు.

అంబ‌రీష్ మృతితో క‌న్నీటి ప‌ర్యంత‌మైన ర‌జ‌నీకాంత్ .. నేను మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఆయ‌న‌ని ఎప్పుడు మిస్ అవుతుంటాను అని అన్నారు. నా నిజ‌మైన స్నేహితుడిని ఈ రోజు కోల్పోయాను అంటూ మోహ‌న్ బాబు ట్వీట్‌లో తెలిపారు. అల్లు అర్జున్ , రాధికా శ‌ర‌త్ కుమార్, ఈషా రెబ్బా , ఖుష్బూ, రాయ్ ల‌క్ష్మీ, బీవీఎస్ ర‌వి, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఇలా ప‌లువురు ప్ర‌ముఖ‌లు అంబరీష్‌కి సంతాపం తెలియ‌జేస్తూ.. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు. అంబ‌రీష్, సుమ‌ల‌త దంప‌తుల‌కి ఒక కుమారుడు కాగా, అత‌నిని కూడా వెండితెర‌కి ప‌రిచ‌యం చేయాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ప్ర‌స్తుతం అభిషేక్ డెబ్యూ చిత్రం అమ‌ర్ చిత్రీక‌ర‌ణ చురుగ్గా సాగుతున్న‌ట్టు స‌మాచారం.

1775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles