త్వ‌ర‌లో ర‌జ‌నీకాంత్ టీవీ ఛానెల్‌

Fri,December 21, 2018 10:01 AM
Rajinikanth fans launching TV channel very soon

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్ప‌టికే కమల్ త‌న‌ పార్టీ పేరు ఎజెండా ప్ర‌క‌టించ‌గా, ర‌జ‌నీకాంత్ త‌న పార్టీకి ‘మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గ‌త ఏడాది డిసెంబ‌ర్ 31న ప్ర‌క‌టించాడు ర‌జ‌నీ. పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్య‌త‌ని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్‌కి ర‌జ‌నీకాంత్‌ అప్ప‌గించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ర‌జ‌నీకాంత్ పేరుతో ఓ టీవీ ఛానెల్ ప్రారంభం కాబోతుంద‌నే విష‌యాన్ని ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్ర‌మ్ క‌న్వీన‌ర్ వీఎం సుధాక‌ర్ తెలిపారు. సూప‌ర్ స్టార్ టీవీ, ర‌జినీ టీవీ, త‌లైవ‌ర్ టీవీ ఇలా మూడు పేర్ల‌తో ట్రేడ్‌మార్క‌ర్ల‌ని న‌మోదు చేసే ప్ర‌క్రియ ప్రారంభించామ‌ని సుధాక‌ర్ అన్నారు. ర‌జ‌నీ పేరు, లోగోలో ఆయ‌న ఫోటో పెట్ట‌డంపై ర‌జ‌నీకాంత్ ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. త్వ‌ర‌లోనే ఈ ఛానెల్‌కి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం అని సుధాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన పేటా సంక్రాంతికి రానుండ‌గా,ఆ త‌ర్వాత మురుగ‌దాస్‌తో త‌న 166వ సినిమా చేయ‌నున్నాడు మ‌న సూప‌ర్ స్టార్.

1896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles