ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కు సినిమాల‌తో బిజీ కానున్న‌ ర‌జ‌నీకాంత్

Sun,May 12, 2019 11:42 AM
rajinikanth busy with movies upto 2021

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తాను లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం లేద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌మిళనాడు శాస‌న స‌భ ఎన్నిక‌ల‌లో మాత్రం పోటీకి సిద్ద‌మ‌ని ప‌లుమార్లు చెప్పారు. 2021లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, అప్ప‌టి వ‌ర‌కు త‌న పూర్తి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటార‌ట త‌లైవా. అప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేస్తూ ఉంటార‌ట‌. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆయ‌న‌ పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ ఏంట‌నే దానిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం ద‌ర్భార్ సినిమాతో బిజీగా ఉన్నారు ర‌జనీకాంత్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నార‌ట‌.

1600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles