2.0 ఓ మహాకావ్యం: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌

Wed,October 25, 2017 05:31 PM
Rajinikanth 2.0 movie audio launch on 27th October 2017

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న‌ భారీ బడ్జెట్ మూవీ 2.0. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ నెల 27న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకు సమీపంలో బుర్జ్ పార్కులో 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ లైవ్ ఫర్‌ఫార్మెన్స్‌తో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. ఇక.. 2.0 మ్యూజిక్ ఈవెంట్‌కు రెడీ అవ్వాలని... ఇంకా రెండు రోజులే ఉందని, ఈ మూవీ ఓ మహాకావ్యం అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.


1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles