వేషం లేదు..ఇంటికి వెళ్లిపో అన్నారు: రజనీకాంత్

Sun,December 8, 2019 04:37 PM


రజనీకాంత్ నటించిన తాజా చిత్రం దర్భార్. ఏ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాటలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన ఒకటి అందరితో పంచుకున్నారు. 16 వయదనిలే సినిమా తర్వాత ఓ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కిస్తానన్నారు. కానీ నేను ఆ సినిమా సెట్స్‌కు వెళ్లేవరకూ నిర్మాత నాకు అడ్వాన్స్ ఇవ్వలేదు. దీంతో నేను అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తానని చెప్పాను. ఆ నిర్మాత కోపపంతో ఊగిపోతూ ఏరా నీకంత పొగరా..నీకు సినిమాలో వేషం లేదు. నీ ఇంటికి వెళ్లిపో అని హెచ్చరించాడు. నిర్మాత ప్రవర్తనతో నాకు చాలా బాధ కలిగింది. ఆ సంఘనతో ఏర్పడిన కసితో ఎంతో కష్టపడి రెండున్నరేళ్లలో ఫారిన్ కారు కొన్నానని చెప్పుకొచ్చాడు రజనీ.

1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles