వధూవరులతో రజనీ సెల్ఫీ..సౌందర్య పెళ్లి ఫొటోలు

Mon,February 11, 2019 08:07 PM
Rajini selfie with new wedding couple soundarya, Vishagan

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగిన విశాగణ్-సౌందర్య పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సౌందర్య ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోశ్లా రూపొందించిన పింక్, బంగారపు చీరలో కనిపించగా..విశాగణ్ సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయాడు. ఈ సందర్భంగా వధూవరులు, ఫ్యామిలీతో కలిసి రజనీ సెల్ఫీ దిగి సందడి చేశారు. పెళ్లి వేడుకలో రజనీ స్టెప్పులేయడం విశేషం.

తమిళనాడు సీఎం పలనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తోపాటు ఇతర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సినీ పరిశ్రమ నుంచి కమల్ హాసన్, మణిరత్నం, సుహాసిని దంపతులు, శివాజీ ప్రభు, రాఘవా లారెన్స్, ప్రేమ్ కుమార్, మంజిమా మోహన్, ధనుష్, మోహన్ బాబు, లక్ష్మీ మంచు, ఆండ్రియా, అనిరుధ్, అదితీ రావు హైదరీతోపాటు ఇతర నటీనటులు హాజరయ్యారు.3520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles