ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదు..

Sun,March 10, 2019 03:27 PM
Rajini says he would not be contesting in bypolls


చెన్నై: తమిళనాడులో రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో రజనీకాంత్‌ను ఎన్నికల పోటీ విషయమై రిపోర్టర్లు ప్రశ్నించారు. రజనీ స్పందిస్తూ..తమిళనాడులో నీటి సంక్షోభం నివారణ కోసం ఎవరైతే చిత్తశుద్ధితో కృషి చేస్తారో..ప్రజలు వారికే ఓటేయాలని రజనీ పిలుపునిచ్చారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని..అసెంబ్లీ ఎన్నికలే తమ లక్షమని రజనీకాంత్‌ ఇటీవలే స్పష్టం చేశారు. రజనీ మక్కల్‌ మండ్రమ్‌ అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు జరుపుతున్న వారెవరూ..వేరే ఏ పార్టీ కోసం, ప్రచారం కోసం తన ఫొటోను ఉపయోగించొద్దని ఇప్పటికే కోరారు. ర‌జనీకాంత్ మాత్రం ఇప్ప‌టికి పార్టీ పేరు, కార్యాచ‌ర‌ణ‌ని ప్ర‌క‌టించ‌ని విషయం తెలిసిందే.

2357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles