ర‌జ‌నీకాంత్ తాజా ప్రాజెక్ట్‌పై బిగ్ అప్‌డేట్

Wed,March 27, 2019 12:23 PM
Rajini-Murugadoss Film To Go On Floors in april

ఇటీవ‌లి కాలంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ర‌జ‌నీకాంత్ నుండి ఓ మంచి చిత్రం రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఆయ‌న స్టార్ డైరెక్ట‌ర్ మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చిన ఇంత‌వ‌ర‌కు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి వెళ్ళ‌లేదు. దీంతో అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 10న ముంబైలో తొలి షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. రెండు నెల‌లో చిత్రాన్ని పూర్తి చేయాల‌ని మురుగ‌దాస్ భావిస్తున్నాడ‌ట‌. న‌య‌న‌తార చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ‌రోసారి ర‌జ‌నీకాంత్ చిత్రానికి స్వ‌రాలు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. ఇందులో ర‌జ‌నీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles